ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన టెన్త్ విద్యార్థిని

Published : Jan 31, 2019, 02:32 PM IST
ఆశ్రమ పాఠశాలలో గర్భం దాల్చిన టెన్త్ విద్యార్థిని

సారాంశం

ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలంలోని  గారపెంట  గిరిజన గూడెంలోని ఆశ్రమ  ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలంలోని  గారపెంట  గిరిజన గూడెంలోని ఆశ్రమ  ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ విషయమై  గిరిజన సంక్షేమ శాఖాధికారులు విచారణ చేపట్టారు.  ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖాధికారులకు  కొందరు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై అధికారులు ఆరా తీశారు.

 బుధవారం నాడు  సహాయ గిరిజన సంక్షేమ శాఖాధికారి దస్తగిరి విచారణ చేపట్టారు.  వైపాలెంలో  సహాయ గిరిజన సంక్షేమ శాఖాధికారి బాలిక కుటుంబసభ్యులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న  యువకుడి కుటుంబసభ్యులు, గ్రామస్థుల సమక్షంలో విచారణ జరిపారు.  విద్యార్థినికి  అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఉందని ఈ పరిచయం  వల్లే ఆ విద్యార్థిని గర్భం దాల్చిందని   బాలిక  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై  గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. విద్యార్థినికి   యుక్త వయస్సు రాగానే .పెళ్లి చేసుకొనేందుకు రెండు కుటుంబాలు ఒప్పుకొన్నాయని  గిరిజప  సంక్షేమ సహాయాధికారికి సమాచారం ఇచ్చారు.  పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్తినిని పంపుతామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై  కఠినంగా వ్యవహరిస్తామని  అధికారులు ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?