హక్కులు అడిగితే ఐటీ దాడులా: కేంద్రంపై బాబు ఆగ్రహం

By narsimha lodeFirst Published Oct 15, 2018, 12:26 PM IST
Highlights

ప్రకృతిని  టెక్నాలజీతో  హ్యాండిల్ చేస్తున్నా....  పొలిటికల్  కుట్రలు ఇబ్బందిగా మారాయని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: ప్రకృతిని  టెక్నాలజీతో  హ్యాండిల్ చేస్తున్నా....  పొలిటికల్  కుట్రలు ఇబ్బందిగా మారాయని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన  హక్కుల కోసం అడిగితే  ఐటీ దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.

సోమవారం నాడు  ఉదయం  నీరు- ప్రగతి, వ్యవసాయంపై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  టెలికాన్పరెన్స్ నిర్వహించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే... ప్రస్తుతం  అధికారంలో  పార్టీ  రాష్ట్రానికి చేసే సహాయం చేసే  విషయంలో వివక్ష చూపుతోందన్నారు.  ఈ పార్టీలకు తోడు రాష్ట్రంలోని మరో పార్టీ కూడ సహాయనిరాకరణ చేస్తోందన్నారు.

తిత్లీ తుఫాన్  ఎప్పుడూ తీరాన్ని దాటుతోందని అంచనావేయగలిగినట్టు చెప్పారు. ఈ అంచనాలు వాస్తవమయ్యాయని చెప్పారు.తుఫాన్ తర్వాత పరిస్థితిని  మదింపు చేయడమే  కీలకమన్నారు,. ఇప్పటికే 35వేల హెక్టార్లలో నష్టపోయిన పంట వివరాలను సేకరించినట్టు  బాబు గుర్తు చేశారు. వంశధార కాల్వ పూడ్చివేత పనులను ఇవాళ సాయంత్రానికి పూర్తి చేస్తామన్నారు.

 అదనపు సిబ్బందిని, అధికారులను రప్పించుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు. పంటల భీమా ద్వారా  రైతాంగానికి పరిహరం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాబు అధికారులను కోరారు.అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు  అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రావడం మాత్రం పక్కా-అలసత్వాన్ని సహించను: అధికారులకు చంద్రబాబు వార్నింగ్

శ్రీకాకుళంకు చేరుకున్న చంద్రబాబు: తిత్లీ తుఫాన్ పై రివ్యూ

click me!