కవాతులో పాల్గొనండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 7:38 AM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ప్రజా పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై తలపెట్టిన కవాతుకు జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న ప్రజా పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌పై తలపెట్టిన కవాతుకు జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకల్లంక వద్ద కవాతు ప్రారంభమవుతుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కవాతు సాగుతుంది.. అనంతరం బ్యారేజ్ దిగువన వున్న కాటన్ విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగసభలో పవర్‌స్టార్ ప్రసంగిస్తారు.

షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంటారు. అనంతరం విజ్జేశ్వరం మీదుగా పిచ్చుకల్లంక వద్ద కాటన్‌‌బ్యారేజ్ వద్దకు చేరుకుని కవాతును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన శ్రేణులను ఉద్దేశించి ట్వీట్ చేశారు..

"వాహనాలపై వచ్చే వారు నిదానంగా రావాలని, వేగం వద్దని సూచించారు. ‘మీ క్షేమమే నాకు ప్రథమ బాధ్యత. బైకులపై వేగంగా వెళ్లాలనిపించినప్పుడు మీ తల్లిదండ్రులను, నన్ను గుర్తుపెట్టుకుని నెమ్మదిగా రండి. మీ ఉత్సాహాన్ని కవాతులో చూపించండి.

బైక్‌యాక్సిలేటర్లతో శబ్దాలు చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. క్రమశిక్షణతో ముందుకెళ్దాం. కలిసి నడుద్దాం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జాతీయ స్పూర్తితో కవాతులో పాల్గొని క్షేమంగా ఇంటికి వెళ్లాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

 

జన సైనికులకు ముఖ్యంగా బైకుల్లో వచ్చే యువత వేగంగా రాకండి,ఉత్సాహాన్ని కవాతులో చూపించండి. బైక్ ఆక్సిలేటర్ సౌండ్లతో ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఇంటి నుంచి జాతీయ స్ఫూర్తి తో కవాతుకు రండి,మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. pic.twitter.com/BdaBjoMp1b

— Pawan Kalyan (@PawanKalyan)

 

మీ క్షేమం నాకు ప్రథమ భాద్యత. బైకుల్లో స్పీడ్ వెళ్ళేటపుడు మీ తల్లితండ్రులుని, నన్ను గుర్తు పెట్టుకోండి, నిదానంగా రండి.. pic.twitter.com/upH9coflAs

— Pawan Kalyan (@PawanKalyan)
click me!