25 పార్లమెంటరీ కమిటీలకు కొత్త అధ్యక్షులు: పార్టీ బలోపేతం కోసం బాబు ప్లాన్

By narsimha lodeFirst Published Sep 27, 2020, 12:15 PM IST
Highlights

 పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షులను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నియమించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను నియమించారు.  రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ కమిటీలకు చంద్రబాబునాయుడు 25 మంది అధ్యక్షులను నియమించారు. 

అమరావతి: పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షులను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు నియమించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులను నియమించారు.  రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ కమిటీలకు చంద్రబాబునాయుడు 25 మంది అధ్యక్షులను నియమించారు. 

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా చంద్రబాబునాయుడు పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో జిల్లా, మండల కమిటీలు ఉండేవి. వీటి స్థానంలో ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులను నియమించారు. జిల్లా కమిటీల తరహాలోనే పార్లమెంట్ కమిటీలకు అధ్యక్షులను నియమించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా పార్టీవర్గాలు తెలిపాయి.

పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షులు వీరే..


శ్రీకాకుళం- రవికుమార్
విజయనగరం- నాగార్జున
అరకు -  సంధ్యారాణి
విశాఖపట్టణం-  శ్రీనివాసరావు
అనకాపల్లి -  జగదీశ్వరరావు
కాకినాడ-  నవీన్
అమలాపురం-  అనంతకుమారి
రాజమండ్రి -  శ్యామూల్
నర్సాపురం-  లక్ష్మీ
ఏలూరు-  వీరాంజనేయులు
మచిలీపట్నం-  నారాయణరావు
విజయవాడ-  రఘురామ్
తిరుపతి - నరసింహాయాదవ్
చిత్తూరు-  ప్రసాద్ (నాని)
రాజంపేట-  శ్రీనివాస్ రెడ్డి
కడప - లింగారెడ్డి
హిందూపురం-  బీకే పార్థసారథి
కర్నూల్ -  వెంకటేశ్వర్లు
నంద్యాల - గౌరు వెంకట్ రెడ్డి
గుంటూరు- శ్రవణ్ కుమార్
నర్సరాపుపేట- జీవీ ఆంజనేయులు
బాపట్ల- శివరావు
ఒంగోలు -బాలాజీ
నెల్లూరు - అబ్దుల్ అజీజ్
అనంతపురం- కాల్వ శ్రీనివాసులు

click me!