అంతర్వేది రథం పనులు ప్రారంభం: నరసింహా హోమం నిర్వహణ

By narsimha lodeFirst Published Sep 27, 2020, 11:28 AM IST
Highlights

అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో నూతన రథం పనులను ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ రథం నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు గాను తొలుత సరసింహాహోమం నిర్వహిస్తున్నారు.

అంతర్వేది: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో నూతన రథం పనులను ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ రథం నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు గాను తొలుత సరసింహాహోమం నిర్వహిస్తున్నారు.

ఆరు చక్రాలతో, ఏడంతస్తులుగా ఈ రథాన్ని నిర్మిస్తున్నారు. ఈ రథం నిర్మాణానికి కావాల్సిన కలపను కూడ ఇప్పటికే అధికారులు ఆలయం వద్దకు తీసుకొచ్చారు. 14 మంది వేద పండితులు  నరసింహ హోమాన్ని నిర్వహిస్తున్నారు. 

రథం నిర్మాణం కోసం ఉపయోగించే కలపను నరసింహ హోమం వద్ద ఉంచి పూజిస్తారు. 

రథ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతర్వేది ఆలయ రథ నిర్మాణ పనులను  ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో పాటు దేవాలయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు రానున్నారు. 

also read;అంతర్వేది నూతన రథ నిర్మాణం... వారికి ప్రాధాన్యతేది: సర్కార్ ను నిలదీసిన పవన్

ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి అంతర్వేది రథం దగ్దం అయింది. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటనను నిరసిస్తూ విపక్షాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసిన విషయం తెలిసిందే.


 

click me!