మా నేతలతో టచ్‌లోకి వైసీపీ: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Published : May 02, 2019, 11:55 AM IST
మా నేతలతో టచ్‌లోకి వైసీపీ: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

గెలుస్తారనుకొనే టీడీపీ నేతలతో వైసీపీ నేతలు కొందరు టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ నేతల బండారాన్ని ఏ రకంగా బయటపెట్టారో  అదే విధంగా ఏపీలో వైసీపీ  కుట్రలను బహిర్గతం చేయాలని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.  

అమరావతి: గెలుస్తారనుకొనే టీడీపీ నేతలతో వైసీపీ నేతలు కొందరు టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ నేతల బండారాన్ని ఏ రకంగా బయటపెట్టారో  అదే విధంగా ఏపీలో వైసీపీ  కుట్రలను బహిర్గతం చేయాలని  చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 23 తర్వాత రాష్ట్రంలో టీడీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పొలిటికల్ ఇంటలిజెన్స్‌పై పార్టీ నేతలు దృష్టి పెట్టాలని బాబు కోరారు.

కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ వాయిస్ మారిందన్నారు. బీజేపీ చాలా వీక్ అయిందని  ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన ఆరోపించారు.  కౌంటింగ్ రోజున కూడ అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు బాబు  సూచించారు.  కౌంటింగ్‌కు వెళ్లే ఏజంట్లకచు టెక్నాలజీపై అవగాహన కల్పించాలన్నారు.  కౌంటింగ్ రోజు కూడ వైసీపీ కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని బాబు ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu