రాబోయేది జనసేన ప్రభుత్వమే: నాగబాబు ధీమా

Published : May 02, 2019, 11:07 AM IST
రాబోయేది జనసేన ప్రభుత్వమే: నాగబాబు ధీమా

సారాంశం

దేశంలో ఉన్న ఉత్తమ నాయకుల్లో పవన కళ్యాణ్ ఒకరని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన ఉండేదని ఆ తపన నుంచి పుట్టుకు వచ్చింది జనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా జనసేన పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడేది జనసేన ప్రభుత్వమేనని నర్సాపురం జనసేన అభ్యర్థి కొణిదెల నాగబాబు జోస్యం చెప్పారు. విశాఖపట్నం జిల్లా ఉక్కునగరం గురజాడ కళాక్షేత్రంలో బుధవారం జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాగబాబు కొద్ది రోజుల్లోనే అద్భుతాన్ని చూడబోతున్నామన్నారు. 
దేశంలో ఉన్న ఉత్తమ నాయకుల్లో పవన కళ్యాణ్ ఒకరని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన ఉండేదని ఆ తపన నుంచి పుట్టుకు వచ్చింది జనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. 

2014లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. గెలుపు, ఓటములతో నిమిత్తం లేకుండా జనసేన పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. మరోవైపు అపారమైన పరిజ్ఞానం, గుండె ధైర్యం, ప్రజాభిమానం కలిగిన నాయకుడు పవన్‌కళ్యాణ్‌ అని చెప్పుకొచ్చారు విశాఖపట్నం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.  

గాజువాకలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసైనికులు చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాగబాబును ఘనంగా సన్మానించారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu