టీడీపీ చీఫ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మంగళవారం నాడుభేటీ అయ్యారు.
విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో టీడీపీ చీఫ్ చంద్రబాబు మంగళవారంనాడు విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు.మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ పై చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు.బీజేపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ అంటే గౌరవం ఉందని అంటూనే ఊడిగం చేయబోనని ప్రకటించారు. బీజేపీతో పొత్తున్నా ఎందుకో పూర్తిస్థాయిలో కలిసి పని చేయలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇవాళ్టి నుండి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుందని పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే విజయవాడ నోవాటెల్ హోటల్ లో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు.
undefined
alsoread:బంతి.. కొట్టు.. సన్నాసి.. నాకు బొడ్డుకోసి పేరు పెట్టారా? : వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలపై పవన్ ఫైర్
విశాఖపట్టణంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్ కి రెండు రోజుల క్రితం చంద్రబాబు పోన్ చేశారు .విశాఖ పట్టణంలో జరిగిన ఘటనల గురించి ఆరా తీశారు. విశాఖ పట్టణం నుండి పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం మంగళవారంనాడు మంగళగిరికి వచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు.
గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను కీలకపాత్ర పోషిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీని ఓడించేందుకు గాను తమ పార్టీ ముందు మూడు ప్రతిపాదనలున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ,జనసేన,టీడీపీలు కలిసి పోటీ చేయడం, బీజేపీ ,జనసేన కలిసి పోటీ చేయడం,లేదా జనసేన ఒంటరిగా పోటీ చేసే ఆఫ్షన్లు మాత్రమే ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గతంఅో పర్యటించిన సమయంలో జనసేనతో పొత్తు విషయమై టీడీపీ కార్యకర్త చేసిన వినతిపై వన్ సైడ్ లవ్ ఎలా సాధ్యమని చంద్రబాబు ప్రశ్నించారు.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయమై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కొంతకాలంగా బీజేపీ తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని ఆయన మాటల ద్వారా అర్ధమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీని గద్దెదించడం కోసం రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కోరినట్టుగా పవన్ కళ్యాణ్ గతంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ బీజేపీ నాయకత్వం నుండి ఆశించిన రీతిలో సహకారం లేనట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
విశాఖలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారని చెబుతున్నారు. అయితే భవిష్యత్ రాజకీయాలపై ఈ ఇద్దరు నేతల మధ్య చర్చలను చూడాల్సిన అవసరం లేదనే వాదించేవారు కూడా లేకపోలేదు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు నిన్ననే పవన్ కళ్యాణ్ తో విజయవాడలో భేటీ అయ్యారు.ఈ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.