కిడారి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

By pratap reddyFirst Published Oct 3, 2018, 1:07 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని  మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమని ఆయన అన్నారు. 

విజయవాడ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిని  మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమని ఆయన అన్నారు. 

కిడారి, సోమ మృతిపై తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ బుధవారం సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలో తాజాగా చేరిన వ్యక్తిని మావోయిస్టులు ట్రాప్‌ చేసి కిడారి, సోమ కదలికలపై నిఘా పెట్టారని, ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్లనే హత్యలు చేశారని ఆయన అన్నారు. 

సంచలనం కోసమే మావోయిస్టులు ఈ హత్యలు చేశారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్‌ హయాంలోనే ఆమోదం తెలిపారని చెప్పారు. తాము అప్పుడు...ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుంటే,  గ్రామదర్శినిపై బుధవారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి అంశంలో మన రాష్ట్రమే ముందుండాలని అన్నారు. బుధవారం గ్రామదర్శనిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామదర్శినికి అధికార యంత్రాంగం తప్పకుండా హాజరుకావాలని, తూతూమంత్రంగా పనిచేస్తే ఫలితాలు రావని అన్నారు. 

click me!