జనసేనలోకి హర్షకుమార్: అందుకే కాంగ్రెస్‌కు షాక్

Published : Oct 03, 2018, 12:59 PM IST
జనసేనలోకి హర్షకుమార్:  అందుకే కాంగ్రెస్‌కు షాక్

సారాంశం

జనసేనలో చేరే విషయాన్ని కాదనలేనని మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పారు

అమలాపురం: జనసేనలో చేరే విషయాన్ని కాదనలేనని మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు  ఆయన స్పష్టత ఇచ్చారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే నా రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఇంటర్, డిగ్రీలో కాంగ్రెస్ తో తన అనుబంధం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేసినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీపై నిరంతరం పోరాటం చేసినట్టు చెప్పారు. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం నాకు బాధ కల్గించిందన్నారు.  దీంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలనే  ఆలోచనను విరమించుకొన్నట్టు ఆయన చెప్పారు.

కొన్ని పార్టీల నుండి తనకు చర్చలు జరుగుతున్నట్టు ఆయన చెప్పారు. తన అనుచరులతో ఈ విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు. తన అనుచరులతో  చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu