చంద్రబాబు నిరుద్యోగ భృతిపై జోకులు పేల్చిన పవన్ కల్యాణ్

By ramya neerukondaFirst Published Oct 3, 2018, 12:54 PM IST
Highlights

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలే తప్ప పాకెట్‌ మనీ ఎందుకని నిరుద్యోగభృతిని ఉద్దేశించి ప్రస్తావించారు. 

రాష్ట్రంలోని నిరుద్యోగులకు యువనేస్తం పేరిట ఉపాధి కల్పిస్తామని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ  భృతిగా రూ.వెయ్యి ఇస్తామని కూడా తెలిపారు. కాగా.. ఈ పథకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోకులు వేశారు. 

నిరుద్యోగులకు కావాల్సింది పాకెట్ మనీ కాదని ఆయన పేర్కొన్నారు. యువతకు పాకెట్‌ మనీ ఇస్తామంటున్న ప్రభుత్వం మహిళలను విస్మరించడం తగదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలే తప్ప పాకెట్‌ మనీ ఎందుకని నిరుద్యోగభృతిని ఉద్దేశించి ప్రస్తావించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కరువయ్యాయన్నారు. మహిళలతో విజయవాడ కేంద్రంగా సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని పవన్‌ పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్రంలో రహదారుల గురించి పవన్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మించామంటున్నారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం రహదారులను చూడండి. ఇక్కడ రహదారులు దారుణంగా ఉన్నాయి. 14 వేల కిలోమీటర్‌ల రోడ్లు ఎక్కడ వేశారు...? రాష్ట్రంలో టిడిపి నాయకులు ఎక్కడ తిరుగుతారో అక్కడ రోడ్లు వేశారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని’’ ప్రభుత్వంపై పవన్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు

click me!