టీడీపీ నేతల అరెస్ట్.. డీజీపీకి చంద్రబాబు లేఖ

By telugu news teamFirst Published Jun 18, 2020, 10:31 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు అంబేద్కర్ మాటలకు అద్ధంపడుతున్నాయి ఇలాంటి నియంత రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.
 

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు  డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే అందుకు పోలీసు సహకారం తగదు

 వైకాపా నేతలు తమ ప్రతీకారేచ్ఛకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధిపొందుతున్నారని ఈ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

పోలీస్ బాస్ గా పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ లను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది శాంతిభద్రతల పరిరక్షణే నియంత రాజకీయాలకు చికిత్స అని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని ఆయన అన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు అంబేద్కర్ మాటలకు అద్ధంపడుతున్నాయి

ఇలాంటి నియంత రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. బలహీన వర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు.  అయ్యన్నపాత్రుడు పై నమోదు చేసిన కేసులు కుట్రలో భాగమేనన్నారు. 

వైద్యులు  సుధాకర్,  అనితారాణిల ఘటన లో పోలీసుల తీరు ప్రజలంతా చూసారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడును చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని ఆరోపించారు.  అధికార వైఎస్సార్ సీపీ ని టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా నేతలను టార్గెట్ చేశారని చెప్పారు. 

అయ్యన్న పాత్రుడు ప్రజాసేవలో  నాలుగు దశాబ్దాలుగా ఉన్నారని చెప్పారు. తన ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేని నాయకుడి పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

click me!