చంద్రబాబు బాగానే ఉన్నారు.. ఆందోళన చెందవద్దు - భువనేశ్వరికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పరామర్శించారు. వారు బస చేస్తున్న క్యాంప్ నకు వెళ్లి భువనేశ్వరితో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు.

Chandrababu is fine.. Don't worry - Pawan Kalyan gives courage to Bhuvaneswari..ISR

చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నారా భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో పవన్ కల్యాణ్ గురువారం ఈరోజు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడి నేరుగా రాజమండ్రి జైలుకు కొద్ది దూరంలో చంద్రబాబు  కుటుంబం బస చేస్తున్న క్యాంప్‌నకు వెళ్లారు. అక్కడ వారిని పరామర్శించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అని అంగీకరించిన యూఏఈ.. పాకిస్థాన్ కు సందేశం..

Latest Videos

ఈ సందర్భంగా భువనేశ్వరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మా.. ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలకు వేశారు. రాజకీయాలను పట్టించుకోని మీపై వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తనను ఆవేదనకు గురి చేసిందని ఆమెతో చెప్పారు. శాసనసభలో కూడా మీపై వ్యాఖ్యలు చేస్తే తనకు ఎంతో బాధనిపించిందని తెలిపారు.

మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని.. కసాయిగా మారిన కన్నతండ్రి.. ఏం చేశాడంటే ? 

ఆంధ్రప్రదేశ్ లో మరే మహిళకు ఇలాంటి ఇబ్బంది రాకూడదని, ఇలా చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు లోపల బాగానే ఉన్నారని భువనేశ్వరికి ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయంలో మీరు ఆందోళన చెందవద్దని పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. మీ ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించేలా చేస్తామని, దీనికి కోసం అందరం కలిసి పని చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ మన వైపే ఉన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తమకు ధైర్యం చెప్పినందుకు జనసేన అధినేతకు భువనేశ్వరి కృతజ్ఞతలు చెప్పారు. 

vuukle one pixel image
click me!