చంద్రబాబుకు గన్నవరం ఎయిర్ పోర్టులో చేదు అనుభవం

Published : Jun 14, 2019, 10:03 PM ISTUpdated : Jun 14, 2019, 10:36 PM IST
చంద్రబాబుకు గన్నవరం ఎయిర్ పోర్టులో చేదు అనుభవం

సారాంశం

విఐపి, జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ఆయనను సాధారణ ప్రయాణికుడిలా పరిగణించి తనిఖీలు కూడా చేశారు. చంద్రబాబు వాహనాలను లోనికి అనుమతించంలేదు. ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు వెళ్లడానికి ప్రత్యేక వాహనాన్ని ఆయన కోసం కేటాయించలేదు.

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి గన్నవరం విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబును అధికారులు ఓ సామాన్య ప్రయాణికుడిలా పరిగణించారు. 

విఐపి, జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ఆయనను సాధారణ ప్రయాణికుడిలా పరిగణించి తనిఖీలు కూడా చేశారు. చంద్రబాబు వాహనాలను లోనికి అనుమతించంలేదు. 

ఎయిర్ పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు వెళ్లడానికి ప్రత్యేక వాహనాన్ని ఆయన కోసం కేటాయించలేదు. ప్రయాణికుల వాహనంలోనే ఆయన ప్రయాణించాల్సి వచ్చింది. చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాాబాదు చేరుకున్నారు.

చంద్రబాబు పట్ల అధికారులు వ్యవహరించిన తీరును తెలుగుదేశం పార్టీ వర్గాలు తప్పు పడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు కాన్వాయ్ కి పైలట్ క్లియరెన్స్ తొలగించారు. 

PREV
click me!

Recommended Stories

Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం
ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu