K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది: కోడెలపై విజయసాయి ఫైర్

By Siva KodatiFirst Published Jun 14, 2019, 7:22 PM IST
Highlights

మాజీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

మాజీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వరుసగా ఫిర్యాదులు అందుతుండటంతో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కోడెల K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు,కూతురు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్ పై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపైనా విజయసాయిరెడ్డి స్పందించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.56 వేల మంది ఉద్యోగులు ఇక నిశ్చింతగా ఉండగలుతారు.

గతంలో రైల్వేలను విలీనం చేయడం కంటే ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 

కోడెల K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోంది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు,కూతురు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన మాజీ స్పీకర్ పై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.56 వేల మంది ఉద్యోగులు ఇక నిశ్చింతగా ఉండగలుతారు. గతంలో రైల్వేలను విలీనం చేయడం కంటే ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!