అవన్నీ పుకార్లే...బీజేపీలో చేరను: తేల్చిచెప్పిన సీఎం రమేశ్

Siva Kodati |  
Published : Jun 14, 2019, 08:10 PM IST
అవన్నీ పుకార్లే...బీజేపీలో చేరను: తేల్చిచెప్పిన సీఎం రమేశ్

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ పార్టీ మారబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. దీనిపై రమేశ్ స్పందించారు.. బీజేపీ నేతలెవరూ మమ్మల్ని సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో  టీడీపీ స్థానాన్ని రిప్లేస్ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలను ఆకర్షిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ పార్టీ మారబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. దీనిపై రమేశ్ స్పందించారు.. బీజేపీ నేతలెవరూ మమ్మల్ని సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీలో చేరేన ఉద్దేశ్యం సైతం తనకు లేదన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులెవ్వరూ భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాము ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదించామన్న ప్రచారం అవాస్తవమని రమేశ్ తెలిపారు. తమకు పార్టీ మారే అవసరం లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu