ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

By pratap reddyFirst Published Sep 23, 2018, 2:05 PM IST
Highlights

ఎమ్మెల్యే హత్యపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. మావోయిస్టుల దాడిని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య వాదులు దాడిని ఖండించాలని ఆయన కోరారు

అమరావతి: శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వర రావును, అతని అనుచరుడు సివేరి సోమ మావోయిస్టులు కాల్చి చంపిన విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చేరవేశారు. చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆమెరికాలో ఉన్న చంద్రబాబు అధికారులు సమాచారం ఇచ్చారు. 

జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సిఎంవో అధికారులు మాట్లాడారు. బస్సులో వెళ్తుండగా ఎమ్మెల్యేపై దాదాపు 50 మంది మావోయిస్టులు దాడి చేశారు. ఎమ్మెల్యే హత్యపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. మావోయిస్టుల దాడిని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య వాదులు దాడిని ఖండించాలని ఆయన కోరారు

హైదరాబాదులో ఉన్న డిజీపి ఆర్పీ ఠాకూర్ విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. సంఘటనా స్థలానికి గ్రేహౌండ్స్ దళాలు చేరుకుంటున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్త

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి

click me!