చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... ముప్పేటదాడికి కేసులు సిద్ధం

By telugu team  |  First Published Dec 15, 2019, 1:58 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పార్టీని ఒకరి తరువాత ఒకరుగా వదిలి వెళ్తున్నారు. చాలా కాలం తరువాత, చంద్రబాబుపై  ఆదాయానికి మించి ఆస్తులున్న కేసు, ఓటు కు నోటు కేసు  మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ కేసులను తిరగదోడేందుకు రంగం సిద్ధమయ్యింది. 
 


రాజకీయ, న్యాయపరమైన సమస్యలు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పార్టీని ఒకరి తరువాత ఒకరుగా వదిలి వెళ్తున్నారు. చాలా కాలం తరువాత, చంద్రబాబుపై  ఆదాయానికి మించి ఆస్తులున్న కేసు, ఓటు కు నోటు కేసు  మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ కేసులను తిరగదోడేందుకు రంగం సిద్ధమయ్యింది. 

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి బిజెపిలో చేరారు. వారిలో వై.సుజనా చౌదరి, సి.ఎం. రమేష్ బాబుకు అత్యంత సన్నిహితులు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎపి తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా పార్టీ నుంచి వైదొలిగారు. 

Also read: తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు

Latest Videos

undefined

అవినాష్ వైయస్ఆర్సిలో చేరారు, వంశీ పార్టీలో చేరుకున్నప్పటికీ... వైసీపీకి తన మద్దతును ప్రకటించారు. మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అతి త్వరలో పార్టీని వీడడానికి యోచిస్తున్నారనేది బహిరంగ రహస్యం. 

చంద్రబాబు నాయుడు ఇసుక సమస్యపై దీక్ష నిర్వహించినప్పుడు, సుమారు 10 మంది టిడి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. జిల్లాల్లో ఆయన సమావేశాల సందర్భంగా కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు సైతం హాజరుకాలేదు. 

గతంలో  సిఎం లేదా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినప్పుడు కూడా ఎన్నడూ ఇలా జరగలేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు పరిస్థితులు ఎంత మాత్రం అనుకూలించడంలేదు. ఇటీవలి రోజుల్లో పార్టీలో అంతర్గత గొడవలు కూడా పెరిగాయి. 

ఇన్ని రోజులు ఒకింత స్తబ్దుగా  ఉన్న కోర్టు కేసులు పునరుద్ధరించబడుతున్నాయి. 2005 లో, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ భార్య లక్ష్మి పార్వతి చంద్రబాబు ఆదాయానికి మించి  ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడుపై అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) కి గతంలో ఫిర్యాదు చేసారు. ఈ కేసును ఇప్పుడు ఎసిబి తిరిగి తెరిచింది. 

Also read: ఓర్వలేక ఇలా చేస్తున్నాడు.. ఆయన ఈ రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరం: విజయసాయి

ఓటు కోసం నగదు కేసులో చంద్రబాబు నాయుడుపై ఒక రకంగా యుద్ధం ప్రకటించి పోరాడుతున్న వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణారెడ్డి, ఈ కేసును విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎసిబి, సుప్రీంకోర్టులు గనుక ఈ కేసులను విచారించడం ప్రారంభిస్తే, చంద్రబాబు నాయుడు పై రాజకీయంగా దాడి చేయడానికి అధికార పక్షానికి నూతన అస్త్రాలు దొరికినట్టవుతాయి.

click me!