మాజీ మంత్రి బండారు తనయుడు అప్పలనాయుడు ర్యాష్ డ్రైవింగ్, ఒకరికి గాయాలు

narsimha lode   | Asianet News
Published : Dec 15, 2019, 11:33 AM IST
మాజీ మంత్రి బండారు తనయుడు అప్పలనాయుడు ర్యాష్ డ్రైవింగ్, ఒకరికి గాయాలు

సారాంశం

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు మీతిమీరిన వేగంతో కారు నడిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.

విశాఖపట్టణం: మాజీ మంత్రి బండారు సత్యనారాయమూర్తి కొడుకు అప్పలనాయుడు టూ వీలర్‌ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి  గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అప్పలనాయుడుతో పాటు రిటైర్డ్ పోలీస్ అధికారి మౌర్య కూడ ఉన్నారు. అప్పలనాయుడు పరారీలో ఉన్నాడు. మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకొన్నాడు.

విశాఖ బీచ్‌ రోడ్డులో మీతిమీరిన వేగంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు వెనుక నుండి టూ వీలర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆదివారం నాడు తెల్లవారుజాముున చోటు చేసుకొంది.  

టూ వీలర్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.  టూ వీలర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన తర్వాత  అప్పలనాయుడు, మౌర్యలు వాగ్వాదానికి దిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో  స్థానికులు అక్కడికి చేరుకొన్న వెంటనే అప్పలనాయుడు అక్కడి నుండి పారిపోయాడు.

సంఘటన స్థలంలోనే మౌర్య ఉన్నాడు. విశాఖ త్రీ టౌన్ పోలీసులు రిటైర్డ్ పోలీసు అధికారి కొడుకు మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వాహనం అతి వేగంగా ఉండడంతో డివైడర్‌పై నుండి దూసుకెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఢీ కొట్టింది. ఈ వేగానికి వాహనం  అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అప్పలనాయుడు కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన బాధితుడు విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్