
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అహంకారం బాగా పెరిగిందని ధ్వజమెత్తారు వైసీపి అధ్యక్షుడు జగన్. ఆయనకు ఉన్న మంచి లక్షణాల్లో ఇదే ప్రముఖం అని జగన్ ఎద్దేవా చేశారు. ఆయనకు కళ్లు తలకెక్కాయని జగన్ నంద్యాల ఆరవ రోజు ప్రచారంలో విమర్శించారు.
నంద్యాల ఏటీఏం సెంటర్ లో నిర్వహించిన రోడ్ షోలలో జగన్ అధికార పార్టీ పై విమర్శనాస్త్రాలను సంధించారు. ఎన్నికలు అనగానే ప్రతీ సామాజిక వర్గానికి చంద్రబాబు ఎర వేస్తున్నారని జగన్ ఆరోపించారు. అప్పటికి కుదరకపోతే బుజ్జగింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. టీడీపీ నేతలంతా నంద్యాలలోనే ఉన్నారని, కేబినెట్ మొత్తం ఇక్కడే తిష్ట వేసిందని జగన్ తెలిపారు. బాబుకు పోయోకాలం దగ్గరపడిందని ఆయన విమర్శించారు
వైసీపి నంద్యాల్లో పోటీ చేయకపోయి ఉంటే ఈ మంత్రులంతా మీకు కనిపించేవారా జగన్ ప్రశ్నించారు. టతంలో ఏనాడైనా మంత్రులందరు నంద్యాల పర్యటనకి వచ్చారా.. అని ప్రజలనుద్దేశించి అడిగారు. ఇదివరకు రేషన్ షాపుల్లో 9 రకాలు సరుకులను ఇచ్చేవారని, ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని జగన్ పేర్కొన్నారు. టీడీపీ పార్టీ నేతలు తమ కుటుంబాలు బాగు కోసం తప్ప ప్రజల అభివృద్ది కోసం పనిచెయ్యడం లేదని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి అని ఈ సందర్భంగా జగన్ పెర్కొన్నారు.