సీబీన్ ఆర్మీ ఉంది.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతా... చంద్రబాబు

Published : Nov 03, 2018, 02:08 PM IST
సీబీన్ ఆర్మీ ఉంది.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతా... చంద్రబాబు

సారాంశం

కేంద్రం విభజనచట్టం అమలు చేయలేదు. ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయిస్తోంది. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం.

ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఒంగోలులో రెండో రోజు కొనసాగుతోంది. మార్టూరు మండలం డేగరమూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శినిలో ఈ రోజు చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని అధికార బీజేపీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు కురిపించారు. చంద్రబాబు ఆర్మీ బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నారు. వ చ్చే ఎన్నికలు ఏకపక్షం గా ఉం డాలి. కోడికత్తి, జెల్లికట్టు, పోలవ రం కాలువలు తెగొట్టడం, అసెంబ్లీకి రాకపోవటం, పార్లమెంట్‌లో రాజీనామాలు చేయటం మనకు తయారైన ప్రతిపక్షం పని అన్నారు. ఓటు వేసే బాధ్యత మీది...జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు.

‘‘కేంద్రం విభజనచట్టం అమలు చేయలేదు. ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు చేయిస్తోంది. అందుకే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం. అడుక్కుంటే లాభం లేదు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి మనది. మనది ఒక వ్యవస్థ. దేశానికి సమస్య వచ్చినప్పుడు దారి చూపే పార్టీ మనది. ధర్మంకోసం, న్యాయం కోసం పారాడుతాం. ఎవరికి భయపడను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు