చంద్రబాబు మాట వినని జాతీయ జండా

First Published Jan 27, 2018, 12:14 PM IST
Highlights
  • అధికారుల నిర్లక్ష్యంతో చంద్రబాబు అందరి ముందు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

రిపబ్లిక్ డే పరేడ్ కు హాజరుకాలేకపోయిన చంద్రబాబునాయుడు శనివారం జాతీయ జెండాను ఎగరేద్దామనుకుని భంగపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో చంద్రబాబు అందరి ముందు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే, విజయవాడలోని మూలపాడు క్రికెట్ స్టేడియంలో అఖిల భారత సర్వీసు అధికారుల సంఘం క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిధిగా హాజరైన  చంద్రబాబు పోటీల ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగరేద్దామనుకున్నారు. అయితే, జెండాను కట్టడంలో తలెత్తిన లోపం కారణంగా జెండాకు కట్టిన ముడి విడిపోలేదు. దాంతో ఎంత ప్రయత్నించినా జెండాను సిఎం ఎగరేయలేకపోయారు. చివరకు చేసేది లేక జెండా ఆవిష్కరణను వదిలేశారు. దాంతో అక్కడున్న వారంతా ‘జాతీయ జెండా సిఎం మాట వినటం లేద’నుకున్నారు. తర్వాత పోటీలు ప్రారంభమైన తర్వాత చంద్రబాబు అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత నిర్వాహకులు జెండా బొంగును క్రిందకి దింపి జెండా ముడిని సరిచేసి మళ్ళీ జెండాను ఎగరేసానుకోండి అది వేరే సంగతి.

click me!