వైసిపిలో చేరనున్న వేమిరెడ్డి..టిడిపికి బిగ్ షాక్

First Published Jan 27, 2018, 11:04 AM IST
Highlights
  • వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో కోస్తా జిల్లాల పర్యటన మంచి ఊపునిస్తోంది.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో కోస్తా జిల్లాల పర్యటన మంచి ఊపునిస్తోంది. కోస్తా ప్రాంతంలో పర్యటన నెల్లూరు జిల్లాతో మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని ప్రముఖ కాంట్రాక్టు సంస్ధల అధిపతుల్లో ఒకరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపిలో  చేరుతున్నారు. ఈ మేరకు రంగం సిద్దమైంది. బహుశా ఆది, సోమవారాల్లో వేమిరెడ్డి జగన్ సమక్షంలో వైసిసి కండువా కప్పుకోనున్నారు.

పాదయాత్రలో జగన్ 29వ తేదీన వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయనున్నారు. ఆ సందర్భంగా వేమిరెడ్డి వైసిపిలో చేరే అవకాశాలే ఎక్కువున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేమిరెడ్డి మొదటి నుండి వైసిపితోనే సంబంధాలు కలిగివున్నారు. అయితే, వేమిరెడ్డి ఆశించిన రాజ్యసభ స్దానాన్ని జగన్ కేటాయించలేకపోయారు. దాంతో అలిగిన రెడ్డి వైసిపికి దూరమయ్యారు. అదే అదునుగా వేమిరెడ్డిని టిడిపిలోకి లాక్కోవాలని గట్టి ప్రయత్నాలే జరిగాయి. వేమిరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు కానీ చివరి నిముషంలో వెనక్కు తగ్గారు.  

అప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అటువంటిది తెరవెనుక జరిగిన ప్రయత్నాల వల్ల వేమిరెడ్డి చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జనగ్ ను కలిసారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో వేమిరెడ్డి-జగన్ భేటీ జరిగిందట. వారిమధ్య  చర్చల సారాంసం తెలీదు కానీ మొత్తానికి వేమిరెడ్డి వైసిపిలో చేరటానికి సిద్దపడ్డారు.

వేమిరెడ్డి వైసిపిలో చేరటం టిడిపికి పరోక్షంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అదే సమయంలో వైసిసికి పెద్ద ప్లస్ అనుకోవాలి. ఎందుకంటే, వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వేమిరెడ్డి ఆర్దికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నారు. ఆర్ధికంగా స్దితిమంతుడైన వేమిరెడ్డి లాంటి వాళ్ళు జగన్ కు ఇపుడు చాలా అవసరం. ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపధ్యంలో వేమిరెడ్డి వైసిపిలో చేరుతుండటంతో పార్టీ వర్గాలు బాగా ఖుషీగా ఉన్నాయ్.

 

click me!