టికెట్ రానివారికి.. చంద్రబాబు భరోసా

Published : Mar 15, 2019, 10:43 AM IST
టికెట్ రానివారికి.. చంద్రబాబు భరోసా

సారాంశం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం రాత్రి చంద్రబాబు.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం రాత్రి చంద్రబాబు.. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. కాగా టికెట్ ఆశించి భంగపడినవారికి ఆయన భరోసా ఇచ్చారు.టికెట్ లభించని వారు నిరాశ చెందవద్దని చెప్పారు. అందరి సేవలను పార్టీ గుర్తించి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. 

శుక్రవారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించటం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. 

సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశామని, కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని, రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థులను ఎంపిక చేశామని చంద్రబాబు అన్నారు. అలాగే టిక్కెట్లు రాని వారిని రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం తప్పక ఇస్తామని చంద్రబాబు అన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?
IMD Rain Alert : ఎల్ నినో వచ్చేస్తోంది .. తెలుగు ప్రజలారా.. ఇక కాస్కొండి..!