పోలీసులతోనే పట్టాభికి హాని... సీఎం జగన్, డిజిపి దే బాధ్యత: నారా లోకేష్

By Arun Kumar PFirst Published Oct 21, 2021, 9:43 AM IST
Highlights

టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అరెస్ట్ పై మాజీ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఆయన ఇంటిపైనే దాడిచేసి తిరిగి ఆయననే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. 

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ పై స్పందిస్తూ మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులపై సీరియస్ అయ్యారు. పట్టాభికి ఏమైనా అయితే డిజిపి గౌతమ్ సవాంగ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని nara lokesh హెచ్చరించారు. 

''ప్ర‌జ‌ల్ని ర‌క్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన ప‌ట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పోలీసులు కాద‌ని తేలిపోయింది. ఏపీలో ప్ర‌జ‌ల‌కీ, ప్ర‌తిప‌క్ష‌నేత‌ల‌కీ ర‌క్ష‌ణ లేదు'' అని అన్నారు.

''ప‌ట్టాభికి హానిత‌ల‌పెట్టాల‌ని పోలీసులు చూస్తున్నారు. ప‌ట్టాభికి ఏమైనా జ‌రిగితే DGP Goutham Sawang, CM YS Jagan దే బాధ్య‌త‌. త‌క్ష‌ణ‌మే ప‌ట్టాభిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాలి. బోస్‌డీకే అనేది రాజ‌ద్రోహం అయితే.. వైసీపీనేత‌ల అస‌భ్య‌ భాష ఏ ద్రోహం కింద‌కి వ‌స్తుందో డిజిపి చెప్పాలి'' అని లోకేష్ నిలదీసాడు. 

read more  పట్టాభి అరెస్ట్: తలుపులు పగులగొట్టి బలవంతంగా లాక్కెళ్లారని భార్య
 
''డ్ర‌గ్స్ గుట్టుర‌ట్టు చేస్తున్నార‌నే ప‌ట్టాభిని అదుపులోకి తీసుకున్నార‌ని ప్ర‌జ‌ల‌కీ అర్థ‌మైంది. ఎన్ని దాడులుచేసినా, ఎంత‌మందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా ప‌రిణ‌మించిన వైసీపీ డ్ర‌గ్స్ మాఫియా ఆట క‌ట్టించేవ‌ర‌కూ టిడిపి పోరాటం ఆగ‌దు'' అని లోకేష్ స్ఫష్టం చేసారు. 

బుధవారం రాత్రి kommareddy pattabhi ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను భారీ బందోబస్త్ మధ్య గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకువచ్చి అరెస్ట్ చేసారని ఆమె ఆరోపించారు. 

పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి భార్య కూడా ఆరోపించారు. ఈ విధంగా అరెస్ట్ చేయడంపై కోర్టుకెక్కుతామని ఆమె హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని అన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని... ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారని ఆమె తెలిపారు. మరోవైపు పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

VIDEO  టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ వీడియో... పోలీసులు ఎలా మోహరించి అదుపులోకి తీసుకున్నారో చూడండి..!

అయితే పట్టాభి ఇంటిపై దాడిచేసిన వైసిపి మూకలను వదిలిపెట్టి తిరిగా ఆయననే అరెస్ట్ చేయడమేంటని పోలీసుల తీరుపై టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు తొత్తులుగా మారారని ఆరోపిస్తున్నారు. పట్టాభిరాం ఇంటిపైనే కాదు టిడిపి జాతీయ కార్యాలయంపై దాడిచేసిన వైసిపి వారిపై చర్యలేవి అని టిడిపి నాయకులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. 


 

click me!