చంద్రబాబు అరెస్ట్: విశాఖకు భువనేశ్వరి, ఆరోగ్యంపై ఆరా

By narsimha lodeFirst Published Feb 27, 2020, 5:51 PM IST
Highlights

చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి గురువారం నాడు సాయంత్రం విశాఖపట్టణానికి చేరుకొన్నారు.

విశాఖపట్టణం: చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరీ గురువారం నాడు సాయంత్రం విశాఖపట్టణానికి చేరుకొన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకొన్నారు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు గురువారం నాడు విశాఖపట్టణానికి వచ్చారు.

Also read:నాడు జగన్‌, నేడు బాబు: విశాఖ ఎయిర్‌పోర్టులో సీన్ రిపీట్

మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకమని ప్రకటించింది. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ కోరుతోంది.ఈ విషయమై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టారు.

Also read:విశాఖలో చంద్రబాబు అరెస్ట్, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌కు తరలింపు

 విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను స్వాగతిస్తున్నామని చంద్రబాబునాయుడు ప్రకటిస్తేనే ఆయనను  అనుమతిస్తామని వైసీపీ ప్రకటించింది. చంద్రబాబు కాన్వాయ్ ను విశాఖ ఎయిర్‌పోర్టు నుండి బయటకు రాకుండా వైసీపీ అడ్డుకొంది. చివరకు చంద్రబాబునాయుడు తన కారు నుండి దిగి ఎయిర్ పోర్టు బయటనే బైఠాయించి నిరసనకు దిగారు.

ఆ తర్వాత చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. విశాఖపట్టణం ఎయిర్ పోర్టు లాంజ్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకొన్న చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు చేరుకొంది.బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

click me!