మాట నిలబెట్టుకున్న జగన్: సీబీఐ చేతికి సుగాలి ప్రీతి కేసు, జీవో జారీ

Siva Kodati |  
Published : Feb 27, 2020, 05:41 PM ISTUpdated : Feb 27, 2020, 05:49 PM IST
మాట నిలబెట్టుకున్న జగన్: సీబీఐ చేతికి సుగాలి ప్రీతి కేసు, జీవో జారీ

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బాలిక సుగాలి ప్రీతిబాయి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం జీవో నెంబర్. 37ను విడుదల చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బాలిక సుగాలి ప్రీతిబాయి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం జీవో నెంబర్. 37ను విడుదల చేసింది. 

గత మంగళవారం కర్నూలులో కంటివెలుగు మూడోదశ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి పార్వతి సహా కుటుంబ సభ్యులు సీఎంను కలుసుకున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంకు ప్రీతి కుటుంబసభ్యులు విజ్ఞప్తిచేశారు. 

Also Read:సుగాలి ప్రీతి కేసు సీబీఐకి: పవన్ స్పందన ఇదీ

దీనిపై స్పందించిన జగన్ ఈ కేసును సీబీఐకి రిఫర్‌ చేస్తున్నామని స్పష్టంచేశారు. తప్పక న్యాయం జరుగుతుందని వారికి భరోసానిచ్చారు. అంతేకాక ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 

అంతకుముందు సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం దిగిరాకపోతే నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

మూడేళ్ల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌లో ప్రీతీ బాయి అనే విద్యార్ధిని హాస్టల్ గదిలో ఉరేసుకుంది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. తమ బిడ్డపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Also Read:నా బిడ్డకు న్యాయం చేయండి: జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

కేసు విచారణలో భాగంగా నిపుణులతో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. దానిపై నిపుణుల కమిటీని వేశారు. ఆరు కమిటీల వరకు ప్రీతి పోస్ట్‌మార్టాన్ని పరిశీలిచంగా.. చివరికి పోలీసులు ఈ కేసులో ఛార్జీ షీటు దాఖలు చేశారు.

అయితే నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి పోలీసులను మేనేజ్ చేస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హోం సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని కలిసి వినతిపత్రం సైతం సమర్పించారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu