రోజా టార్గెట్: వంగలపూడి అనితకు చంద్రబాబు కీలక పదవి

Published : Jan 31, 2020, 07:58 AM IST
రోజా టార్గెట్: వంగలపూడి అనితకు చంద్రబాబు కీలక పదవి

సారాంశం

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించారు. రోజాను టార్గెట్ చేయడానికి అనితకు కీలక పదవి అప్పగించినట్లు తెలుస్తోంది.

విజయవాడ: మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక పదవిలో నియమించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా అనితను ఆయన నియమించారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై  వంగలపూడి అనిత సారధ్యంలో తెలుగు మహిళలు పోరాటం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు ఒక ప్రకటనలో అన్నారు.

గతంలో ఆమె పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రస్తుత శాసనసభ్యురాలు రోజాను రోజాపై ధీటుగా వ్యాఖ్యలు చేయగల సత్తా ఆమెకు ఉంది. రోజా తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అనిత ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 

రోజాను లక్ష్యం చేసుకోవడానికి అనితను చంద్రబాబు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

వంగలపూడి అనితే 1984 జనవరి 1వ తేదీన జన్మించారు. ఆమె భర్త శివప్రసాద్. విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం ఆమె స్వస్థలం.

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu