ఏపి మంత్రుల శాఖల్లో మార్పు... మోపిదేవి, గౌతమ్ రెడ్డిలకు షాక్

By Arun Kumar PFirst Published Jan 30, 2020, 9:27 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 

అమరావతి: రాష్ట్ర కేబినెట్ లోని ఇద్దరు మంత్రుల పోర్ట్ ఫోలియోలలో మార్పులు చేపట్టింది ఏపి ప్రభుత్వం.  మంత్రి మోపిదేవి వెంకట రమణ నుంచి మార్కెటింగ్ శాఖను, 
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  నుంచి ఆహార శుద్ధి  విభాగాన్ని తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. 

ఆంధ్ర ప్రదేశ్ మండలి రద్దుతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిపదవులు ప్రశ్నార్థకంగా మారాయి. వీరిద్దరు శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ మంత్రి పదవులను పొందారు. అయితే తాజాగా మండలిని రద్దుతో వీరిద్దరి పదవులపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మోపిదేవి నుండి మార్కెటింగ్ శాఖను వేరే మంత్రికి కేటాయించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. 

వైఎస్ కుటుంబానిది 32వేల ఎకరాల భూకుంభకోణం....: పంచుమర్తి అనురాధ

మండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మోపిదేవి ఇప్పటికే వెల్లడించారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. టీడీపీ తరహాలో తాము పదవుల కోసం అర్రులు చాచే రకం కాదని....  ఎవరి ట్రాప్ లోనూ తాము పడలేమన్నారు మంత్రి మోపిదేవి. 

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దునకు సంబంధించి క్లియరెన్స్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి, వైసిపి ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు.  రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని... దాన్ని తాము గౌరవిస్తామన్నారు. 

read more  మరో కీలక నిర్ణయం దిశగా జగన్... త్వరలో ప్రభుత్వ ప్రకటన: ఎమ్మెల్యే గోపిరెడ్డి

శాసనమండలి ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలకు పరిమితం కాకుండా ఏకంగా నిర్ణయాలనే అడ్డుకునే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన బిల్లులను సైతం అడ్డుకున్నారని... సెలెక్ట్ కమిటీకి పంపిన రెండు బిల్లులు అలాంటివేనని అన్నారు. అత్యంత ప్రాధాన్యమైన బిల్లులను ఎలా అడ్డుకుంటారు..?  అని మోపిదేవి ప్రశ్నించారు. 

 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ బ్యాంకుకు నష్టం జరుగుతుందనే బిల్లులను టీడీపీ అడ్డుకుందని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నా శాసన మండలిని చంద్రబాబు కనుసన్నల్లో ఎలా పెట్టుకుంటారు..? అని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి అభివృద్దిని అడ్డుకునే మండలి రద్దు చేయడం మంచి నిర్ణయమేనని మోపిదేవి పేర్కొన్నారు. 

 
 

click me!