ఏపీలో ఇంత జరుగుతుంటే ఉదాసీనంగా వుంటారేంటి...: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ కు వర్ల ఘాటు లేఖ

By Arun Kumar PFirst Published Jun 23, 2021, 10:53 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో దళితులపై దాడులు, పోలీస్ కేసులతో వేధింపులను వివరిస్తూ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ కు లేఖ రాశారు వర్ల రామయ్య. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో దళితులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  పొలిట్  బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దళితులపై దాడులు, పోలీస్ కేసులతో వేధింపులను వివరిస్తూ కమీషన్ కు లేఖ రాశారు రామయ్య. 

తరచుగా రాష్ట్రవ్యాప్తంగా దళిత వర్గాలపై జరుగుతున్న దాడులపై తగు చర్య తీసుకోవాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ ను రామయ్య కోరారు. ప్రస్తుత ప్రభుత్వంలో దళిత వర్గాలపై ఎన్నో దాడులు జరుగుతున్నా జాతీయ షెడ్యూల్డ్  కులాల కమీషన్ ఉదాసీనంగా ఉండటాన్ని తప్పుపట్టాడు రామయ్య. 

read more  జగన్ గారూ... కరోనా సమయంలో పరీక్షలా?: జగన్ కు రఘురామ మరో లేఖ

నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియా దౌర్జన్యాన్ని ప్రశ్నించిన మల్లికార్జున్ అనే దళితుడిపై తప్పుడు కేసులు బనాయించారు. దాడిచేసిన అధికార పార్టీ వారిని వదిలి దళిత వర్గానికి చెందిన మల్లికార్జున్ పై కేసు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. మల్లికార్జున్ పై రౌడీషీట్ పెట్టాలన్న అధికార పార్టీ నాయకుల కోరిక తీర్చడం కోసం పోలీసులు తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. కాబట్టి వెంటనే నెల్లూరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని రామయ్య షెడ్యూల్డ్ కులాల కమీషన్ ను కోరారు. 

రెండేళ్లుగా దళిత వర్గాలపై జరుగుతున్న దాడులను విచారించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి రాష్ట్రానికి పంపాలని కమీషన్ ను కోరారు. జాతీయ మానవ హక్కుల కమీషన్ అన్నా, షెడ్యూల్డ్ కులాల కమీషన్ అన్నా, జాతీయ గిరిజన కులాల కమీషన్ అన్నా ఈ ప్రభుత్వానికి కించిత్  గౌరవం కూడా లేదని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. 

click me!