అవి ర్యాండమైజేషన్‌ స్లిప్పులు, ఆర్వోపై చర్యలకు ఆదేశాలు: సిఈవో ద్వివేది ఫైర్

By Nagaraju penumalaFirst Published Apr 15, 2019, 8:14 PM IST
Highlights

వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు పెట్టి తక్షణం అరెస్ట్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజును ఆదేశించారు. ప్రతి నియోజక వర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని సిఈవో గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. 

అమరావతి: 
నెర్నూలు జిల్లా ఆత్మకూరులో కలకలం రేపిన వీవీప్యాట్‌ స్లిప్పులు వ్యవహారంపై సిఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆత్మకూరు ప్రభుత్వం ఉన్నత పాఠశాల ఆవరణలో లభించిన వీవీ ప్యాట్ స్లిప్పులు పోలింగ్ రోజువి కాదన్నారు. 

ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల కేవలం ఈవిఎంల కమిషనింగ్ సెంటర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలో ఉన్న ఈవిఎం కమిషనింగ్‌ సెంటర్‌లో బ్యాలెట్‌ పత్రాలు పెట్టి చెక్‌ చేశారని తెలిపారు. 

పోలింగ్‌కు ముందు ఒక్కో నియోజక వర్గానికి కేటాయించిన ఈవిఎంలలో వెయ్యి  ఓట్లను బెల్ ఇంజినీర్లు పోల్‌ చేశారని తెలిపారు. ఈవిఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాత వాటిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారని క్లారిటీ ఇచ్చారు. 

ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా  కమిషనింగ్‌ సమయంలో వేసిన వీవీప్యాట్‌ స్లిప్పులను బయట పారేశారని తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. 

బాధ్యులైన ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు పెట్టి తక్షణం అరెస్ట్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజును ఆదేశించారు. ప్రతి నియోజక వర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని సిఈవో గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. 

click me!