రాజకీయ ప్రత్యర్థులను చంపాలన్న టీడీపీ ఎమ్మెల్యే: పోలీసులకు వైసీపీ ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Apr 15, 2019, 6:14 PM IST
Highlights

రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఈ ఆధారాలను సాక్ష్యంగా పెట్టుకుని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ తర్వాత హింసను ప్రేరేపించేలా ఎమ్మెల్యే సూరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినప్పటికీ నేతల మధ్య మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాదు భౌతిక దాడులకు సైతం దిగుతున్నారు ఇరు పార్టీల నేతలు. 

దీంతో వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఈ ఆధారాలను సాక్ష్యంగా పెట్టుకుని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలింగ్‌ తర్వాత హింసను ప్రేరేపించేలా ఎమ్మెల్యే సూరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు చెప్పిన ఆడియోలను పోలీసులకు అందజేశారు. ఆడియో టేపుల్లో సూరి వాయిస్‌ స్పష్టంగా ఉందని తెలిపారు. 

ఎమ్మెల్యే సూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఆస్తుల విధ్వంసం, భౌతిక దాడుల కేసుల్లో సూరిని నిందితుడిగా చేర్చాలని కోరారు. వరదాపురం సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చెయ్యనున్నట్లు చెప్పుకొచ్చారు కేతిరెడ్డి వెంకంట్రామిరెడ్డి.  

click me!