దాడి చేసింది మీరే, సానుభూతి కోసం చొక్కాలు చింపుకుంది మీరే: టీడీపీపై ఈసికి వైసీపీ ఫిర్యాదు

By Nagaraju penumalaFirst Published Apr 15, 2019, 6:36 PM IST
Highlights

ధర్మవరం ఎమ్మెల్యే సూరి వైసీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ లో వ్యవహరించారని ఆరోపించారు. ఆయనపై దాడి జరగకపోయినా చొక్కాల చింపుకుని దాడి జరిగినట్లు చూపించి సానుభూతి పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. 

ఢిల్లీ: ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఆంధ్రప్రదేశ్ లో దాడులకు కారణం తెలుగుదేశం పార్టీయే కారణమని ఆరోపించారు. 

సీఎం చంద్రబాబు నాయుడుకు తొత్తుగా పనిచేసిన ఎస్పీలు ఉన్నచోటనే దాడులు జరిగాయని ఆరోపించారు. తాము ఎన్నికలకు ముందు రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందని తెలిసి ఎస్పీలను  మార్చాలని ఈసీని కోరామని అయితే కొందరిని మాత్రమే మార్చారని ఆరోపించారు. 

విజయనగరం, చిత్తూరు, గుంటూరు, అనంతపురం ఎస్పీలను మార్చకపోవడం వల్లే అక్కడ దాడులు జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు దిగారని ఆరోపించారు. ధర్మవరం ఎమ్మెల్యే సూరి వైసీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 

వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ లో వ్యవహరించారని ఆరోపించారు. ఆయనపై దాడి జరగకపోయినా చొక్కాల చింపుకుని దాడి జరిగినట్లు చూపించి సానుభూతి పొందాలని ప్రయత్నించారని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని దానిపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలు మెురాయించడానికి కారణం ఎన్నికల్లో నారాయణ, చైతన్య విద్యాసంస్థలకు చెందిన ప్రైవేట్ ఉద్యోగులను వినియోగించడమేనని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. 

ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఈనెల 11న ఉదయం కుటుంబ సమేతంగా ఓటు వేసిన చంద్రబాబుకు ఆనాడు ఈవీఎంలో ఏం జరుగుతుందో తెలియలేదా అని ప్రశ్నించారు. 

12న కూడా ఓటు ఎవరికి వేశారో కూడా తెలియలేదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ సైతం చెప్తోందని అందువల్లే చంద్రబాబు ఇలా డ్రామాలు ఆడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. 

click me!