చంద్రబాబుకు కేంద్రం షాక్...పోలవరం కాంట్రాక్టర్ ను మార్చేది లేదు

First Published Oct 26, 2017, 8:48 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది.
  • ముందు అనుకున్నట్లే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ట్రాన్ స్ట్రాయ్ సంస్ధను మార్చటానికి కేంద్రం అంగీకరించలేదు.
  • ఇపుడు కాంట్రాక్టర్ ను మర్చితే సమయం వృధా అవటంతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటూ రాష్ట్రప్రభుత్వానికి స్పష్టం చేసింది.

చంద్రబాబునాయుడుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. ముందు అనుకున్నట్లే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ట్రాన్ స్ట్రాయ్ సంస్ధను మార్చటానికి కేంద్రం అంగీకరించలేదు. ఇపుడు కాంట్రాక్టర్ ను మర్చితే సమయం వృధా అవటంతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటూ రాష్ట్రప్రభుత్వానికి స్పష్టం చేసింది. కాంట్రాక్టర్ ను మార్చితే మళ్ళీ అంచనా వ్యయం పెరుగుతందన్న అభిప్రాయానికే కేంద్రం కట్టుబడి ఉంది.

అంచనా వ్యయాలను భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కూడా కేంద్రం చంద్రబాబుకు స్పష్టం చేసేసింది. ఒకవేళ పెరుగుతుందని అనుకుంటున్న అంచనా వ్యయాలను రాష్ట్రప్రభుత్వం భరించేట్లయితే తమకు అభ్యంతరం లేదని తెలివిగా కేంద్రం చెప్పింది. ఎలాగూ వేల కోట్లరూపాయల అంచనా వ్యయాలను భరించే స్ధితిలో రాష్ట్రం లేదన్న విషయం కేంద్రానికి బాగా తెలుసు.

అందుకే తెలివిగా బంతిని రాష్ట్రప్రభుత్వం కోర్టులోకి నెట్టేసింది. పైగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ తో ఒప్పందాన్ని పెళ్ళిళ్ళ కాంట్రాక్టర్ తో పోల్చటంతోనే కేంద్రం ఆలోచనేంటో స్పష్టమైపోతోంది. ‘2019లోగా పోలవరం పూర్తవ్వటానికి రాష్ట్రం ఏమడిగినా ఇస్తాం.. కానీ ఒక్క కాంట్రాక్టర్ మార్పు తప్ప’ అంటూ తెగేసి చెప్పింది.

నిజానికి ట్రాన్ స్ట్రాయ్ సంస్ధకు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులను చేసేంత అర్హత లేదు. కానీ టిడిపి నరసరావుపేట ఎంపి రాయపాటిసాంబశివరావుకు చెందిన సంస్ధ కాబట్టే చంద్రబాబు నిబంధనలన్నింటినీ పక్కనబెట్టి మరీ ట్రాన్ స్ట్రాయ్ కు పనులు కబ్టబెట్టారు. దాని పర్యవసానాలే ఇపుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్నది. ప్రాజెక్టును చేపట్టేంత ఆర్ధిక శక్తి లేనికారణంగానే పనులను సంస్ధ వేగంగా చేయలేకపోతోందని ఇపుడు ఉన్నతాధికారులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.

ట్రాన్ స్ట్రాయ్ సంస్ధ గురించి తనకు బాగా తెలుసని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పటం విశేషం. పనులు సకాలంలో చేయలేని కారణంగానే మధ్యప్రదేశ్ లో రోడ్డు నిర్మాణ పనుల నుండి తప్పించినట్లు గడ్కరీ గుర్తు చేసారు మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు. అంటే అర్ధమేంటి? అర్హత లేని సంస్ధకు అసలు పనులు ఎలా అప్పగించారనే కదా? కాబట్టే ‘మీ ఖర్మ అనుభవించండి’ అన్నట్లుంది గడ్కరీ వైఖరి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 58 వేల కోట్లకు పెంచటంపైన కూడా కేంద్ర జలసంఘం ఉన్నతాధికారులు అభ్యతరం తెలిపారట.

 

 

click me!