17న విభజన అంశాలపై భేటీ: జగన్ కు తీపి కబురు అందేనా?

By SumaBala Bukka  |  First Published Feb 12, 2022, 1:18 PM IST

ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావె ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 


అమరావతి : ఈ నెల 17 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం కూడా ఎజెండాలో ఉంది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రత్యేక హోదా విషయంలో తీపి కబురు అందుతుందా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇది జరిగితే కనుక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లే.

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం Central Home ministry త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలమీద కేంద్ర హోం శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ Virtual గా నిర్వహించనున్నారు. 

Latest Videos

ఈనెల 17న ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలపై చర్చించేందుకు భేటీ కానున్న హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని త్రిసభ్య అధికారుల బృందం. ఈనెల 8న హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన భేటీలో Tripartite Committee ఏర్పాటు చేసిన హోం శాఖ. 

ఇరు రాష్ట్రాల మధ్య గత ఏడేళ్లుగా పరిష్కారం కాని అంశాలను... పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. 

ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.


త్రిసభ్య కమిటి ఎజెండాలో 9 అంశాలు

1. ఏపీ స్టేట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్ విభజన

2.ఏపీ  - తెలంగాణ మధ్య వినియోగ సమస్యపై పరిష్కారం

3.పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం

4.రాష్ట్రాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు

5. APSCSCL, TSCSCL మధ్య నగదు ఖాతాల విభజన

6 ఏపీ - తెలంగాణ మధ్య వివిధ  వనరుల పంపిణీ

7.ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జిల్లాల ప్రత్యేక గ్రాంటు

8.ఆంధ్రప్రదేశ్‌కు  ప్రత్యేక హోదా

9.  రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు

click me!