ఎల్వీ ప్రసాద్ కేంద్ర సర్వీసులకు వెళ్లి సీవీసీ చైర్మన్ గా నియమితులైతే జగన్ కు కాస్త ఇబ్బందేనని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం అంత సుముఖంగా లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లడం, సీవీసీ చైర్మన్ గా నియమితులైతే ఆయనపై ఉన్న కేసులను రద్దు చేయించుకోవడంతోపాటు జగన్ ను ఇరుకున పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందేమోనన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
న్యూఢిల్లీ : ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎస్ బదిలీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేంద్రం సీరియస్ గా ఉందని సమాచారం. ఆకస్మాత్తుగా సీఎస్ పై బదిలీ వేటు వేయడం వెనుక కారణాలపై ఆరా తీస్తోంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి ఎందుకు బదిలీ చేశారు అనే అంశంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించారని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను అంతగా ప్రాధాన్యత లేని బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేయడంపై ఆరా తీస్తున్నారట.
ఇదిలా ఉంటే వైయస్ జగన్ బదిలీ వేటువేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం సేవలను వాడుకోవాలని కేంద్రం భావిస్తోందట. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ బాధ్యతలు అప్పగించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సీవీసీ చైర్మన్ గా ప్రస్తుతం కేవీ చౌదరి ఉన్నారు. ఆయనను తప్పించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే పదిహేను రోజుల్లో సీవీసీ చైర్మన్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. అయితే సీవీసీ చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు ఎల్వీ సుబ్రహ్మణ్యంకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇకపోతే ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్ కావడానికి ఐదు నెలలు మాత్రమే ఉంది. 2020 ఏప్రిల్ 30న ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్ కానున్నారు. ఈలోపు ఆయన కేంద్ర సర్వీసుల్లో చేరి సీవీసీ చైర్మన్ గా నియమితులైతే మరో ఐదేళ్లపాటు ఆయన చైర్మన్ హోదాలో కొనసాగే అవకాశం ఉంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం గనుక సీవీసీ చైర్మన్ గా నియమితులైతే అదొక రికార్డేనని చెప్పుకోవాలి. ఇకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడం ఆయనకు ఒక విధంగా మంచిదేనని తెలుస్తోంది.
వాస్తవానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది దేశ వ్యవస్థలలో అత్యంత కీలకమైనది. సీబీఐ, ఐటీ, దేశ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానంగా ఉంటుంది. సీబీఐను సైతం నియంత్రించగల శక్తి ఉన్న శాఖలలో విజిలెన్స్ కమిషన్ ఒకటి.
ఇవన్నీ తెలిసే ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. సీవీసీ నోటిఫికేషన్ విడుదల కోసం వేచి చూస్తున్నారని సమాచారం. అందువల్లే మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించకుండానే వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇకపోతే సీఎస్ గా పనిచేస్తున్నప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం వైయస్ జగన్ మాటలను విస్మరించారని ప్రచారం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో సీఎం జగన్ ఆదేశాలను సైతం బేఖాతారు చేసినట్లు సమాచారం.
ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి భూ సేకరణకు సంబంధించి సీఎం జగన్ విడుదల చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా సంబంధిత ఫైలును కూడా పెండింగ్‌లో పెట్టడంతో అగాథం పెరిగిందని తెలుస్తోంది.
స్పందన కార్యక్రమంలో సీఎం ఆదేశాలు పట్టించుకోకపోవడం, ఇళ్ళ స్థలాల ఎంపికపై సీఎం అభిమతానికి భిన్నంగా మాట్లాడడమే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వంలో జరుగుతున్న ఇంటర్నల్ మేటర్స్ ఓ సెలెక్టివ్ మీడియా సంస్థలకు ఎల్వీ చేరవేస్తున్నారంటూ సీఎం జగన్ కు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలిసిందని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం జగన్ పక్కాగా వేటు వేశారని తెలుస్తోంది. ఇకపోతే ఎల్వీ ప్రసాద్ కేంద్ర సర్వీసులకు వెళ్లి సీవీసీ చైర్మన్ గా నియమితులైతే జగన్ కు కాస్త ఇబ్బందేనని తెలుస్తోంది.
ఇప్పటికే సీఎం జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం అంత సుముఖంగా లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లడం, సీవీసీ చైర్మన్ గా నియమితులైతే ఆయనపై ఉన్న కేసులను రద్దు చేయించుకోవడంతోపాటు జగన్ ను ఇరుకున పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందేమోనన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
డిజిపికీ సీఎస్ గతే... జగన్ కూడా కాపాడలేరు..: చంద్రబాబు
సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే
బదిలీ ఎఫెక్ట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన నిర్ణయం