విభజన కమిటీ భేటీ: జగన్‌కు షాకిచ్చిన కేంద్రం, ఎజెండా నుంచి ‘‘హోదా’’ అంశం తొలగింపు

Siva Kodati |  
Published : Feb 12, 2022, 07:07 PM ISTUpdated : Feb 12, 2022, 08:42 PM IST
విభజన కమిటీ భేటీ: జగన్‌కు షాకిచ్చిన కేంద్రం, ఎజెండా నుంచి ‘‘హోదా’’ అంశం తొలగింపు

సారాంశం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. 

కాగా.. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం Central Home ministry త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ Virtual గా నిర్వహించనున్నారు. 

 ఈనెల 8న హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో జరిగిన భేటీలో Tripartite Committee ఏర్పాటు చేసిన హోం శాఖ. ఇరు రాష్ట్రాల మధ్య గత ఏడేళ్లుగా పరిష్కారం కాని అంశాలను... పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.

ఎజెండాలో ఉంచిన అంశాలు

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన 

ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల సెటిల్మెంట్ 

పన్నుల విషయంలో తలెత్తిన లోపాల తొలగింపు

బ్యాంకుల్లో ఉన్న నగదు, డిపాజిట్ల విభజన 

ఏపీ,  తెలంగాణ క్యాష్ క్రెడిట్ అంశాలు

ఎజెండా నుంచి తొలగించిన అంశాలు

రిసోర్స్ గ్యాప్ ...

ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు 

ప్రత్యేక హోదా , పన్ను రాయితీలు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu