జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. బాబు, లోకేశ్ ఆ రాత్రి భోంచేసి వుండరు : విజయసాయిరెడ్డి సెటైర్లు

Siva Kodati |  
Published : Feb 12, 2022, 05:56 PM ISTUpdated : Feb 12, 2022, 06:01 PM IST
జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. బాబు, లోకేశ్ ఆ రాత్రి భోంచేసి వుండరు : విజయసాయిరెడ్డి సెటైర్లు

సారాంశం

టాలీవుడ్‌ కష్టాలపై సినీ ప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వ్యవహారంపై విపక్షాల విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సీఎం జగన్ ని కలవడం పచ్చ పార్టీలో పెద్దపెద్ద కలకలమే లేపినట్టుందని ఆయన దుయ్యబట్టారు

టాలీవుడ్‌లో (tollywood) నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ను (ys jagan) సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి సంబంధించి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (telugu desam party) చేస్తున్న విమర్శలకు వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy) కౌంటరిచ్చారు. సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సీఎం జగన్ ని కలవడం పచ్చ పార్టీలో పెద్దపెద్ద కలకలమే లేపినట్టుందని ఆయన దుయ్యబట్టారు. బాబు గారు, ఆయన తనయుడు రాత్రి భోంచేసి ఉండరని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యజమానుల బాధ చూసి పార్టీ నాయకులూ పొర్లిపొర్లి శోకాలు పెట్టి ఉంటారని .. సినిమావాళ్లు చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తనాదాలు అవసరమా? అంటూ ఆయన ప్రశ్నించారు.

కాగా.. శుక్రవారం టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. సినీ పరిశ్రమకు ఆయన హయాంలో ఏమైనా చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. సినీ జనాలను రాజకీయాలకు వాడుకోవడం, ఎన్నికల్లో ప్రచారానికి పిలవడం తప్పించి.. సినీ పరిశ్రమకు చంద్రబాబు ఏ మేరకు ఉపయోగపడ్డాడని మంత్రి నిలదీశారు. తనకు నచ్చినవాళ్లని ఒకరకంగా .. నచ్చిన వారిని మరోరకంగా ట్రీట్ చేస్తారని పేర్ని నాని ఆరోపించారు. 

దర్శకుడు గుణశేఖర్‌ను అడిగితే ఆయనే అన్ని చెబుతారంటూ మంత్రి చురకలు వేశారు. చిరంజీవి సినిమాను ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఆయన సోదరుడే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారని నాని ఆరోపించారు. సినిమా వాళ్లు కాలర్ ఎగరేసుకుని పనిచేసుకునే విధానాన్ని తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అంటూ మంత్రి ప్రశంసించారు. మొన్న ఏడ్చినట్లుగానే ఇవాళ కూడా చంద్రబాబు ఏడుస్తున్నారంటూ పేర్ని నాని చురకలు వేశారు. 2002 నుంచి మోహన్ బాబు కుటుంబంతో తనకు  వ్యక్తిగతమైన అనుబంధం వుందని... బొత్స సత్యనారాయణ ఇంట్లో పెళ్లికి వెళ్లి, మోహన్ బాబు ఇంట్లో కాఫీ తాగొచ్చానని పేర్ని నాని చెప్పారు. 

సినిమావాళ్లు పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తే.. చంద్రబాబు విమర్శిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నిన్న మీటింగ్‌కి చంద్రబాబు వచ్చి ఏమైనా విన్నారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున ఎవరికీ సంజాయిషీ ఇవ్వలేదని.. నేనే చెప్పిన తర్వాతే విష్ణు ట్వీట్ అప్‌డేట్ చేశారని మంత్రి తెలిపారు. ఎవరెవరో ట్వీట్లు చేస్తే తనకు సంబంధం ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు. నిన్న సీఎం జగన్‌ను కలిసిన సినిమావాళ్లకు మా పార్టీ సభ్యత్వం వుందా అని మంత్రి నిలదీశారు. ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu