సత్ఫలితాలనిస్తున్న మనం- మన పరిశుభ్రత కార్యక్రమం: జాతీయ స్థాయిలో ప్రశంసలు

By Siva KodatiFirst Published Sep 3, 2020, 8:43 PM IST
Highlights

కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘మనం - మన పరిశుభ్రత’’ చక్కటి ఫలితాలను ఇస్తుంది.

కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘‘మనం - మన పరిశుభ్రత’’ చక్కటి ఫలితాలను ఇస్తుంది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో పాటు ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్నాయి.

మనం - మన పరిశుభ్రత కార్యక్రమం ఇప్పటికే ఏపీ లోని 13 జిల్లాల్లో ఎంపిక చేసిన 1320 గ్రామాల్లో అమలు చేశారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేపడుతూ.. అక్కడి స్థానిక ప్రతినిధులను సభ్యులుగా చేర్చుకొని అధికారులు ముందుకు సాగుతున్నారు.

 

 

గ్రామంలోని ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ ఆయా గ్రామాల్లో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు అధికారులు ఎంతో కృషి చేశారు. ఈ పనుల వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలు అంటువ్యాధులకు గురవకుండా జాగ్రత్త పడ్డారు.

దాంతో అక్కడ ప్రతి ఏడు వచ్చే వ్యాధుల శాతంతో పోలిస్తే ఈ ఏడు ఆ శాతం భారీగా తగ్గటం గమనార్హం. మనం మన పరిశుభ్రత" కార్యక్రమాన్ని 5 లక్షల 50 వేల ఇళ్లకు చేరేలా ఏపీ ప్రభుత్వం విజయవంతమైంది.

 

పారిశుధ్య నిర్వహణ సమస్యలతో పాటు... తాగునీరు, మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత వంటి పనులపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీనితో పాటు వైనా సమస్యలుంటే అక్కడి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటిని పరిష్కరించారు.

 

 

ఈ కార్యక్రమం పట్ల పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 15 వేల సమస్యలను పరిష్కరించారు. ఈ అద్భుతమైన కార్యక్రమం అమలు తీరును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కూడా ఆరా తీయటం కొసమెరుపు. 

 

click me!