చంద్రబాబుపై మండుతున్న కేంద్రం

First Published Jan 8, 2018, 4:06 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడుపై కేంద్రప్రభుత్వం మండిపోతోంది.

చంద్రబాబునాయుడుపై కేంద్రప్రభుత్వం మండిపోతోంది. రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ. 1583 కోట్లకు రాష్ట్రప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యుసి) ఇవ్వటమే కారణమట. చేసిన ఖర్చుకు యుసి ఇచ్చినందుకు కేంద్రం ఎందుకు మండిపోతోంది? అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. విభజన చట్టం ప్రకారం సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాణాలకు కేంద్రమే నిధులు సమకూర్చాలి. సరే, విభజన చట్టంలో చాలానే ఉన్నా వీటి వరకూ కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్రప్రభుత్వమూ ఖర్చు చేసేసింది.  అయితే, సమస్య అంతా ఇక్కడే మొదలైంది.

అదేమిటంటే, రాజధాని అమరావతిలో మూడున్నరేళ్ళల్లో రాష్ట్రం కట్టింది తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ మాత్రమే. వాటి నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని వైసిపి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు నిర్మాణాలు మినహా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. సరే, పట్టిసీమ అంటారా అందులో కూడా అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్దారించింది.

కేంద్రమేమో రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం నిర్మాణాలకు నిధులిస్తే ఒక్క సచివాలయం మినహా ఇంకేమీ కట్టలేదు. మరి, సచివాలయంతో పాటు హైకోర్టు, రాజ్ భవన్ కూడా నిర్మించేసినట్లు రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి యూసిని ఎలా పంపిందన్నదే అర్ధం కావటం లేదు.

ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతున్న విషయం ఏమిటంటే, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాంచకుండానే నిర్మించేసినట్లు యూసి పంపింది. పై రెండింటిని రాష్ట్రం నిర్మించివుంటే కనబడాలి కదా? మరి, ఎక్కడా కననబడటం లేదే? ఇక్కడే సమస్య మొదలైంది. పై రెండింటిని కట్టకుండానే కట్టేసినట్లు యూసిని పంపిందంటే అర్ధమేంటి? వాటికోసం కేటాయించిన డబ్బును రాష్ట్రప్రభుత్వం ఇంకదేనికో వాడేసింది.

ఈ విషయంలోనే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వంపై మండిపోతోందట. ఈ విషయమంతా మొన్న వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్రమిచ్చిన సమాధానంతో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మ్యాటరేమిటంటే కేంద్రప్రభుత్వం ముందు రాష్ట్రం అడ్డంగా దొరికిపోయింది. అందుకనే కేంద్రం విడుదల చేసిన ప్రతీ రూపాయికి ఇపుడు రాష్ట్రప్రభుత్వాన్ని లెక్కలు అడుగుతోంది.

click me!