పందేలపై పెరిగిపోతున్న ఉత్కంఠ (వీడియో)

First Published Jan 8, 2018, 12:57 PM IST
Highlights
  • సంక్రాంతి కోళ్ళ పందేలపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది.

సంక్రాంతి కోళ్ళ పందేలపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. పందేలు జరగాల్సిందేనంటూ నేతలు పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ కోళ్ళ పందేలు జరిగేందుకు లేదంటూ కోర్టు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చేసింది. ఈ నేపధ్యంలో పందేల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఎందుకంటే, సంక్రాంతికి కోళ్ళ పందేలు నిర్వహించటమన్నది అత్యంత ప్రతిష్టాత్మకం. పందేలు కూడా అలా ఇలా జరగదు. వందల కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతుంది. కోళ పందేల్లో పాల్గొనేందుకు విదేశాల నుండి కూడా వచ్చేస్తారంటే ఎంత ఫేమస్సో అర్ధం చేసుకోవచ్చు.

ప్రతీసారి లాగానే ఇపుడు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోని భీమవరం కేంద్రంగా కోళ్ళ పందేల నిర్వహణకు ‘బరులు’ సిద్ధమైపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో కలిపి సుమారు 200 దాకా బరులు రెడీ అవుతున్నట్లు సమాచారం. భీమవరం పట్టణంతో పాటు చుట్టుపక్కలున్న గెస్ట్ హౌసులు, హోటళ్ళు అతిధుల కోసం సిద్దమైపోయాయి. విచిత్రమేమిటంటే, 24 గంటలూ పార్టీల వారిగా విభేదించుకునే నేతలు కోళ్ళ పందేల విషయంలో మాత్రం ఏకమైపోతుంటారు. అందుకనే, కోళ్ళ పందేలను ఎవ్వరూ ఆపలేకపోతున్నారు.

 

సరే, పందేల నిర్వహణను అడ్డుకునేందుకు కోర్టు ప్రతీసారి ఇస్తున్నట్లే ఇపుడు కూడా ఆదేశాలను ఇచ్చింది. కానీ అవి అమలు కావటం లేదు. ఎందుకంటే, కోర్టు ఆదేశాలైనా, ప్రభుత్వ ఉత్తర్వులైనా అమలు చేయాల్సింది చివరకు పోలీసులే. అయితే, మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోళ్ళ పందేల్లో యాక్టివ్ పార్టు తీసుకుంటుంటే పోలీసులు మాత్రం ఏం చేయగలరు?

సరే, సంక్రాంతి పండుగ దగ్గర పడేకొద్దీ బరిలోకి దింపాల్సిన కోళ్ళు కూడా రెడీ అయిపోతున్నాయి. పందెం బరిలోకి దింపాల్సిన కోళ్ళను ట్రైనర్లు దాదాపు ఆరుమాసాలుగా రెడీ చేస్తున్నారు. వీటిని రెడీ చేయటం వెనుక పెద్ద కసరత్తే ఉంటుంది లేండి. వీడియోలో చూపినట్లుగా ప్రతీ కోడిని ఒ పంజరంలో ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో విడివిడిగా ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారు. మొత్తం మీద పందేల్లో కొన్ని వందల కోళ్ళు పాల్గొంటాయి. అందుకనే కోళ్ళను పందేలకు సిద్ధం చేసే ట్రైనర్లకు యమా గిరికీ ఉంటుందని వేరే చెప్పాలా?

click me!