జడ్జిలు, న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు: సీల్డ్ కవర్లో ఏపీ హైకోర్టుకు సీబీఐ నివేదిక

By narsimha lode  |  First Published Nov 24, 2021, 9:45 AM IST

న్యాయ వ్యవస్థ, హైకోర్టు న్యాయ మూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ హైకోర్టుకు సీబీఐ డైరెక్టర్ సీల్డ్ కవర్లో నివేదికను అందించారు. ఈ నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ కు అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.


అమరావతి: న్యాయ వ్యవస్థ, హైకోర్టు న్యాయ మూర్తుల ప్రతిష్టను దిగజార్చుతూ అనుచిత పోస్టులు పెట్టిన కేసులో దర్యాప్తు పురోగతిని  సీబీఐ  డైరెక్టర్ మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ముందుంచారు.  సీల్డ్ కవర్లో  నివేదికను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.  ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ వ్యవస్థతో పాటు, జడ్జిలను కించపర్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. 

Ap high court రిజిస్ట్రార్‌ జనరల్‌ తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. Judiciary, Judgeలకు సంబంధించిన వీడియోల యూఆర్‌ఎల్‌ వివరాలను సామాజిక మాధ్యమాల గ్రీవెన్స్‌ అధికారులకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అందజేశారన్నారు.  రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన యూఆర్‌ఎల్‌ వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు వీడియోలను తొలగిస్తున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. . కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు పురోగతిపై Cbi డైరెక్టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సీల్డ్‌ కవర్‌లో ఉన్నఆ రిపోర్టును పరిశీలించకుండా వాదనలు కొనసాగించడం సాధ్యం కాదన్నారు.

Latest Videos

also read:జడ్జీలపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల కేసు.. మరో ఆరుగురిపై చార్జ్‌షీట్‌ నమోదు చేసిన సీబీఐ

సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు హైకోర్టులో వాదనలను విన్పించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ దశలో వివరాలను నిందితులకు అందజేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పారు.  కోర్టు ఆదేశిస్తే వివరాలను పిటిషనర్‌కు అందజేస్తామన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. వీడియోలను తొలగించాలని సీబీఐ నేరుగా సామాజిక మాధ్యమాలను కోరలేదని చెప్పారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ద్వారా వివరాలు అందజేస్తే వీడియోలు తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

న్యాయవ్యవస్థను దూషిస్తూ పెట్టిన పోస్టులకు  సంబంధించిన Urlను అందజేస్తే సంబంధిత వీడియోను తొలగిస్తామని చెప్పారు. అయితే సంబంధిత వ్యక్తి ప్రొఫైల్‌ను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. యూట్యూబ్‌, గూగుల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పూవయ్య, ట్విట్టర్‌ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సీబీఐ డైరెక్టర్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ను రిజిస్ట్రార్‌ జనరల్‌కు అందజేయాలని ఆదేశించింది . ఈ కేసు  విచారణను  వచ్చే నెల  13 తేదికి  వాయి దా వేసింది. 

తొలుత ఈ కేసును Cidతో విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.  అయితే దర్యాప్తులో పురోగతి లేనందున  ఈ కేసును 
 స్వతంత్ర  సంస్థతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ గత ఏడాది మే 26వ తేదీన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం 2020 అక్టోబర్‌ 12న ఈ వ్యాఖ్యల వ్యవహారంలో ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని సీబీఐని ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు ఇటీవల విచారణకు రాగా ఈ కేసు విచారణ ప్రారంభమైన దగ్గర నుంచి ఏమిచేశారో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. 


 

click me!