సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసు: సీబీఐ నివేదిక, విచారణకు 3 నెలల సమయం

By narsimha lode  |  First Published Jul 5, 2021, 3:02 PM IST

సోషల్ మీడియాలో  హైకోర్టుతో పాటు న్యాయమూర్తులను కించపర్చేవిధంగా పోస్టులపై సీబీఐ  తన నివేదికను హైకోర్టుకు సోమవారం నాడు సమర్పించింది. ఈ కేసు విచారణకు మూడు మాసాల సమయం పడుతుందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
 


అమరావతి:  సోషల్ మీడియాలో  హైకోర్టుతో పాటు న్యాయమూర్తులను కించపర్చేవిధంగా పోస్టులపై సీబీఐ  తన నివేదికను హైకోర్టుకు సోమవారం నాడు సమర్పించింది. ఈ కేసు విచారణకు మూడు మాసాల సమయం పడుతుందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. న్యాయమూర్తులు, హైకోర్టుపై సోషల్ మీడియాలో కించపర్చే పోస్టులను  ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. ఈ కేసు విచారణకు మూడు మాసాల సమయం పడుతుందని ఏపీ హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

also read:ఏపీ హైకోర్టు సంచలనం: సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్య పోస్టుల కేసు సీబీఐకి అప్పగింత

Latest Videos

సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపర్చేలా పెట్టిన పోస్టులపై హైకోర్టు ఆదేశం మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మొత్తం 12 కేసులు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై కేసులు పెట్టారు. 2020 నవంబర్ 16 నిందితులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2020 సెప్టెంబర్ 12వ తేదీన సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో జడ్జిలకు, న్యాయవ్యవస్థను కించపర్చేలా పోస్టులు పెట్టారు. వైసీపీ  సానుభూతిపరులే ఎక్కువగా ఈ పోస్టులు పెట్టారనే ఆరోపణలున్నాయి. 


 

click me!