అసైన్డ్ భూముల వ్యవహారం... పోలా రవికి సీఐడి నోటిసులు... ఎవరీ రవి?

By Arun Kumar PFirst Published Jul 5, 2021, 2:10 PM IST
Highlights

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి వాస్తవ పరిస్థితులతో రవికి సంబంధం ఉందని నమ్మడానికి సంతకంతో కూడిన గట్టి కారణాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తికి  సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

అమరావతి: రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో పోలా రవి అనే వ్యక్తికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులతో రవికి సంబంధం ఉందని నమ్మడానికి సంతకంతో కూడిన గట్టి కారణాలు ఉన్నాయని ఈ నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.  అసైన్డ్ భూముల లావాదేవీలకు సంబంధించిన కొన్ని పత్రాలలో అతడు అటెస్టర్(సాక్షి)గా సంతకం చేసినట్లు  సమాచారం ఉందని సీఐడీ పేర్కొంది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సీఐడీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సీఐడి నోటీసు జారీచేసింది.
 
ఉద్దండ్రాయునిపాలెం చెందిన పోలా రవి అసైన్డ్ పొలం అమ్ముకున్నాడు. రవికి 1.60 ఎకరాల లంక భూమి వుండగా గతంలో 60సెంట్లు అమ్ముకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సీఐడి నోటీసులు జారీ చేసింది. 

వీడియో

తనకు సీఐడి నోటీసులు జారీ చేయడంపై రవి స్పందిస్తూ... ఓటు బ్యాంకు కోసమే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డ్రామాలడుతున్నారని అన్నారు. దళితుల్ని ఈ జగన్ ప్రభుత్వం మోసం చేసిందని... తమ ఇష్టపూర్వకంగానే లంక అసైన్డ్ భూములు అమ్ముకున్నామన్నారు. మమ్మల్ని ఎవరు బయపెట్టలేదు, బెదిరించి భూములు లాక్కోలేదని అన్నారు. అయినా లాక్కోవడానికి భూములు ఏమన్నా బొమ్మా...?అని అన్నారు. 

''అమరావతి నుండి రాజధానిని తరలించడానికే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా డ్రామాలు ఆడుతున్నారు. రెండేళ్ల నుండి దళితులకు కౌలు రావడంలేదు. రైతుల పక్షపాతిగా సీఎం జగన్ ఉండి రాజధాని ఇక్కడే ఉంచితే ళితులందరం ఆయనకు పాలాభిషేకం చేస్తాం. ఇప్పటికైనా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేలా సదుపాయం కల్పించండి'' అని రవి కోరారు. 

''రాజధాని మొత్తం పిచ్చి మొక్కలతో అద్వానంగా అయ్యింది. చంద్రబాబు 5 ఏళ్ళు కష్టపడి రాజధాని పనులు చేశారు. కడవ పాలల్లో ఒక్క చుక్క విషపు చుక్కవేసినట్టు జగన్ చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో ...34000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు మనోవేదనకు గురి అయ్యారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మార్చుకుని అసైన్డ్ రైతులకు 1450 గజాలు ఇచ్చి..రాజధాని ఇక్కడే ఉంచి..తిరిగి పనులు ప్రారంభిస్తే అందరూ సంతోషంగా వుంటారు'' అని పోలా రవి కోరారు. 

click me!