హక్కుల కోసం హైదరాబాద్ వెళ్లాలా..? ... జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

By Arun Kumar PFirst Published Jul 5, 2021, 1:39 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో విచారణ జరిపిన హైకోర్టు జగన్ సర్కార్ తీరుపై మండిపడింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మానవ హక్కుల కమీషన్ ను పక్కరాష్ట్రం హైదరాబాద్ లోనే  కొనసాగించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం కోసం రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి రావడం సరికాదని అన్నారు. హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త సంస్థలు సొంత రాష్ట్రాల్లోనే ఉండాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 

రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కార్యాలయం హైదరాబాద్ లోనే కొనసాగించడంపై ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ(సోమవారం) విచారణ జరిపిన న్యాయస్థానం జగన్ సర్కార్ తీరుపై మండిపడింది. 

READ MORE  జగన్ సొంత జిల్లాలో దారుణం... టిడిపి మద్దతుదాలపై వాలంటీర్, వైసిపి శ్రేణులు వేట కొడవళ్ళతో దాడి (వీడియో)

''మానవ హక్కుల కమిషన్ ఆఫీస్ సొంత రాష్ట్రంలోనే ఉండాలి మేము సూచిస్తున్నాము. మీరు త్వరలో ఒక నిర్ణయానికి రండి లేకుంటే మేమే డైరెక్షన్స్ ఇస్తాము. ఈ విషయంలో రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు'' అని ఏపీ ప్రభుత్వానికి  హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 
  
''ఏపీ మానవ హక్కుల కమిషన్ ఉండాల్సిందే హైదరాబాదులో కాదు సొంత రాష్ట్రం లో ఉండాలి. ఆ దిశగా చర్యలు తీసుకోండి'' అని ఏపీ హైకోర్టు ఆదేశాలిస్తూ ప్రభుత్వానికి రెండు వారాలు గడువు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.

click me!