విదేశాల్లో చదివి లోకల్‌గా డాక్టర్ సర్టిఫికెట్లు .. వెలుగులోకి స్కాం, తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

By Siva KodatiFirst Published Dec 29, 2022, 2:31 PM IST
Highlights

నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్ల స్కాంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్ల స్కాంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. విదేశాల్లో చదివి స్థానికంగా నకిలీ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు డాక్టర్లు. ఇవి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అందించిన సర్టిఫికెట్లుగా సృష్టిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, విజయవాడ, విశాఖ నగరాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!