బాపట్ల : పొలంలో పనిచేస్తూ స్పహతప్పిన 17 మంది కూలీలు, పలువురి పరిస్థితి విషమం

Siva Kodati |  
Published : Dec 29, 2022, 02:11 PM IST
బాపట్ల : పొలంలో పనిచేస్తూ స్పహతప్పిన 17 మంది కూలీలు, పలువురి పరిస్థితి విషమం

సారాంశం

బాపట్ల జిల్లా చిననందిపాడులో 17 మంది వ్యవసాయ కూలీలు స్పృహతప్పి పడిపోయారు. దీంతో వీరందరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.   

బాపట్ల జిల్లా చిననందిపాడులో కూలీలు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది. గురువారం పొలంలో పనిచేస్తుండగా 17 మంది కూలీలు స్పృహ తప్పిపడిపోయారు. దీంతో తోటి కూలీలు వీరందరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా వుండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తా..!| Chandrababu Powerful Speech | Asianet News Telugu
ఒకటే ఈలలు అరుపులు | Chandrababu Crazy Fans | Asianet Telugu