పెనుకొండలో టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ సోదాలు

Published : Nov 04, 2022, 10:59 AM IST
పెనుకొండలో  టీడీపీ నేత సవిత  ఇంట్లో సీబీఐ సోదాలు

సారాంశం

సత్యసాయి  హిందూపురం  జిల్లా  పెనుకొండలో టీడీపీ  నేత సవిత ఇంట్లో  సీబీఐ అధికారులు  ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. సవిత భర్త వెంకటేశ్వరరావు  రైల్వే కాంట్రాక్టర్  గా  పనిచేస్తున్నాడు.

అనంతపురం: సత్యసాయి హిందూపురం జిల్లా పెనుకొండలో టీడీపీ నేత  సవిత ఇంట్లో  సీబీఐ  అధికారులు శుక్రవారంనాడు సోదాలు నిర్వహిస్తున్నారు.సవిత  భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్ గా  పనిచేస్తున్నాడు. 

కర్ణాటక   రాష్ట్రంలో నమోదైన కేసులో సవిత  ఇంట్లో సీబీఐ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్  చానెల్  ఏబీఎన్ కథనం  ప్రసారం  చేసింది. పెనుకొండలో  ఉన్న సఃవిత  ఇంట్లో  ఇవాళ  ఉదయం బెంగుళూరు నుండి వచ్చిన  సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ  ఉదయం  ఆరు గంటల నుండి సవిత ఇంట్లోని రికార్డులను లావాదేవీలను సీబీఐ  అధికారులు పరిశీలిస్తున్నారు.

రైల్వే పనుల్లో చోటు చేసుకున్న అవినీతి  అంశంపై  నమోదైన కేసుల విషయమై  సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సీబీఐ  అధికారులు చెబుతున్నారని  సమాచారం.  రాజకీయంగా తనను ఇబ్బందికి గురిచేసేందుకుగాను సీబీఐ అధికారులతో ప్రత్యర్ధులు దాడులు  చేయిస్తున్నారని సవిత  ఆరోపిస్తున్నారని  ఆ కథనం  తెలిపింది.సోదాలునిర్వహించే సమయంలో కనీసం  స్థానిక పోలీసులు  లేకపోవడంపై   కూడ  సవిత  తరపు న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు.  సీబీఐ అధికారులు నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని సవిత తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?