వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శంకర్ రెడ్డి విచారణ

By narsimha lodeFirst Published Aug 13, 2021, 3:07 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ ఇవాళ విచారించింది. ఆయనతో పాటు రఘునాథ్ రెడ్డి, డాక్టర్ భరత్ రెడ్డిని అధికారులు విచారించారు.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. 68 రోజులుగా ఈ కేసును విచారిస్తున్నారు.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ విచారించింది.

also read:వైఎస్ వివేకా హత్య: ఆయుధాలను స్వాధీనం చేసుకొన్న సీబీఐ

పులివెందుల క్యాంప్ కార్యాలయంలో  పనిచేసే రఘునాథ్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు  డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు విచారించారు.ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. 

2019 మార్చి 14వ తేదీ రాత్రి తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి పలువురి అనుమానితుల పేర్లను కూడ సీబీఐకి అందించింది.

రెండేళ్లుగా ఈ కేసులో నిందితులను గుర్తించకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులకు ఆమె వినతిపత్రం సమర్పించారు.ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. 68 రోజులుగా  సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

గోవాలో సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసిన తర్వాత  ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించారని ప్రచారం సాగుతోంది. సునీల్ కి ఈ హత్యతో సంబంధం లేదని కుటుంబసభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.

click me!