నకిలీ చలానాల స్కామ్: ఏపీ వ్యాప్తంగా తనిఖీలు.. ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్ , సీఐడీ చేతికి విచారణ

By Siva Kodati  |  First Published Aug 13, 2021, 2:25 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన నకిలీ చలానాల కేసులో అక్రమాల వెలికితీతకు విజిలెన్స్ లేదా సీఐడీకి కేసును అప్పగించే అవకాశం వుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది ప్రభుత్వం


ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వెలుగుచూసిన బోగస్ చలానాల స్కామ్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ త్వరలోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అక్రమాల వెలికితీతకు విజిలెన్స్ లేదా సీఐడీకి కేసును అప్పగించే అవకాశం వుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఏడాది నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు 5.5  కోట్ల అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. పది కోట్ల వరకు అక్రమాలు జరిగి వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. ఇవాళ లేదా రేపు విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసే అవకాశం వుంది. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. 
 

click me!